అన్నమయ్య: రాయచోటి మహిళా డిగ్రీ కళాశాలలో ఓ పారిశుద్ధ్య కార్మికురాలు ఉద్యోగుల తీరును నిరసిస్తూ కాలేజీ మైదానంలో ధర్నాకు దిగారు. తాను ఎంత పనిచేసినా పనితీరు లేదని వేధిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ 3 నెలల్లో రిటైర్ అవుతారని, ఆ తర్వాత తనను ఉద్యోగం నుంచి తొలగిస్తామని, తెలుగు లెక్చరర్ బెదిరించారని ఆమె ఆరోపించారు.