GNTR: తెనాలిలోని పలు శైవ క్షేత్రాల్లో శనివారం శివ ముక్కోటి ఉత్సవాలు నిర్వహించారు. గంగానమ్మపేటలోని పాత శివాలయంలో శ్రీ పర్వత వర్థిని సమేత రామేశ్వరస్వామి వారు నంది వాహనంపై ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనం ఇచ్చారు. తెల్లవారుజాము నుంచి భక్తుల శివాలయాలకు వెళ్లి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. స్వామికి విశేష పూజలు చేసి, గ్రామోత్సవం జరిపారు.