SKLM: మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, స్త్రీల విద్యాభివృద్ధికి జీవితాంతం కృషి చేసిన తొలి తరం మహిళా ఉద్యమ కారిణి సావిత్రిబాయి పూలే అని ఏపీ టీపీసీ ఛైర్మన్ వజ్జ బాబూరావు అన్నారు. ఇవాళ పూలే జయంతి సందర్భంగా పలాస మున్సిపాలిటీలోని మదర్ థెరీసా హైస్కూల్లో ఆమె జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు ఆర్పించారు.