VZM: తెర్లాం మండలం రంగప్పవలస సర్పంచ్ శనపతి రాంబాబు ఆధ్వర్యంలో ఇవాళ గ్రామంలో పూడికతీత పనులు నిర్వహించారు. ఈ మేరకు వీధి కాలువల్లో పూడికతీత పనులను వేతనదారులతో చేయించారు. గ్రామంలోని అన్ని వీధుల్లో గల కాలువల్లో చెత్తాచెదారాలను, పూడికలను తొలగిస్తున్నట్లు ఆయన తెలిపారు. గ్రామస్తులకు వీధి కాలువల్లో చెత్తాచెదారాలు వేయవద్దని సూచించారు.