MDK: నిజాంపేట మండల కేంద్రంలో శనివారం ఆటో డ్రైవర్లను ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఆటో డ్రైవర్లకు చేస్తానన్న సహాయాన్ని చేయాలని డిమాండ్ చేశారు. ‘ఛలో అసెంబ్లీ’ ముట్టడికి వెళుతున్న తరుణంలో పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.