కృష్ణా: కోడి పందాలు, గుండాట, పేకాట జూద కార్యకలాపాలు నిర్వహించరాదని అవనిగడ్డ ఎస్సై కే. శ్రీనివాస్ హెచ్చరించారు. శనివారం అవనిగడ్డ స్టేషన్ పరిధిలోని పలు ప్రదేశాల్లో ప్రచార బ్యానర్లు ఏర్పాటు చేశారు. అసాంఘిక కార్యకలాపాలు చట్టరీత్యా నేరమని, వాటిని నిర్వహించే వారితో పాటు ప్రోత్సహించే వారిపై కూడా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.