మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే 195వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పోచమ్మ అశ్విని శ్రీనివాస్ ఆధ్వర్యంలో పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అణగారిన వర్గాల విద్యాభివృద్ధికి, మహిళా సాధికారతకు సావిత్రిబాయి చేసిన పోరాటం చిరస్మరణీయమని కొనియాడారు.