NLR: నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ ఆదేశాల మేరకు వెటర్నరీ వైద్యులు డాక్టర్ మదన్ మోహన్ నేతృత్వంలో వీధుల్లో సంచరించే శునకాలను నియంత్రించే క్రమంలో భాగంగా శనివారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. స్థానిక రామ్మూర్తి నగర్, వెంకటేశ్వరపురం, మైపాడు రోడ్డు, తదితర ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ ద్వారా 21 వీధి శునకాలను పట్టారు.