ATP: రాప్తాడు నియోజకవర్గం ముత్తవకుంట్ల గ్రామంలో ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆర్డీఓ మహేష్ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ రాజముద్రతో ఉన్న కొత్త పుస్తకాలను అందజేశారు. పట్టాదారు పుస్తకాలపై అధికారిక ముద్ర ఉండటం తమకు ఎంతో భరోసా ఇస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.