MDK:11వ తెలంగాణ స్టేట్ క్రాస్ కంట్రీ ఛాంపియన్షిప్ గచ్చిబౌలిలోని జీఎం బాలయోగి స్టేడియంలో రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలు జరిగాయి. ఇందులో అండర్-20 మహిళలు 8కి. మీ.ల విభాగంలో బానోత్ అనిత మెదక్ జిల్లా ఛాంపియన్‌షిప్‌గా నిలిచింది. ఆమెకు తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి, ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకటేశ్వర్ రెడ్డి ట్రోఫీని అందజేశారు.