SKLM: నగరంలోని YSR కల్యాణ మండపంలో ఇవాళ నుంచి రెండు రోజుల పాటు రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ తైక్వాండో ఛాంపియన్ షిప్ పోటీలు నిర్వహించనున్నారు. జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో పోటీలు జరుగుతాయని ఏపీటీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తైక్వాండో శ్రీను శుక్రవారం ప్రకటనలో పేర్కొన్నారు. సుమారు 500 మంది క్రీడాకారులు హాజరవుతారని తెలిపారు.