KNR: సావిత్రిబాయి ఫూలే జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజును ‘మహిళా ఉపాధ్యాయ దినోత్సవం’గా నిర్వహిస్తూ జిల్లా స్థాయిలో ఘనంగా వేడుకలు జరపాలని విద్యాశాఖ ఆదేశించింది. పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఇ.నవీన్ నికోలస్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీచేశారు. ప్రతిజిల్లాలో సేవలందించిన 10 మంది ఉత్తమ మహిళను సత్కరించనున్నారు.