కృష్ణా: ఈనెల 1వ తేదీ రాత్రి 10:30 గంటలకు కానూరు మురళీ నగర్లోని సర్వాణి హోటల్ పక్క సందులో నివాసముంటున్న ఓ మహిళ, తన 21 సంవత్సరాల కుమార్తె ఇంటి నుంచి చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయిందని పెనమలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసుల నిరంతర ప్రయత్నాల ఫలితంగా 24 గంటల వ్యవధిలోనే యువతి ఆచూకీని గుర్తించి, ఆమెను నిన్న సురక్షితంగా తల్లికి అప్పగించారు.