TPT: తిరుపతి కొర్లగుంటకు చెందిన అమీర్ అనే వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. నూతన సంవత్సరం సందర్భంగా మృతుడి భార్య తన సొంత ఊరికి వెళ్లగా, మానసిక వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.