ADB: గ్రామాభివృద్ధి పేరిట వేలంపాట నిర్వహించి డబ్బులు వసూలు చేస్తే చర్యలు తప్పవని ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి శనివారం తెలియజేశారు. ఈ మేరకు కుచులాపూర్, సాయిలింగి, పల్లి(బి) గ్రామాల వీడీసీ సభ్యులపై పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనట్లు వెల్లడించారు. గ్రామ అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేసి చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని హెచ్చరించారు.