AKP: కోటవారట్ల ప్రాంతంలో విపరీతంగా మంచు కురుస్తుంది. ఈ మంచు కారణంగా ముఖ్యంగా జీడి మామిడి రైతులు తీవ్ర నష్టాలని ఎదుర్కొంటున్నాం అని వాపోతున్నారు. పూత దశలో అధిక మోతాదులో మంచు కురవడం వల్ల పంటకు నష్టం వాటిల్లుతుంది అని రైతులు తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.