GDWL: నేషనల్ జూనియర్ కబడ్డీ పోటీలకు గద్వాల జిల్లాకు చెందిన అజిత్, మహేష్ ఎంపికయ్యారు. గత నెల పాలమూరులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరచడంతో వీరికి స్థానం లభించిందని కబడ్డీ సెక్రటరీ నరసింహ శుక్రవరం తెలిపారు. ఈ నెల 26 నుంచి విజయవాడలో జరిగే జాతీయ పోటీల్లో వీరు ఇదరు పాల్గొననున్నారు. దీంతో కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు.