MDK: టెట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు గంటన్నర ముందే కేంద్రానికి చేరుకుని బయోమెట్రిక్ ప్రక్రియను సమర్థంగా పూర్తిచేయాలని అధికారులు సూచించారు. హాల్ టికెట్‌తోపాటు ఒరిజినల్ ఫొటో ఐడీ కార్డు, బ్లూ పెన్/బ్లాక్ పెన్ మాత్రమే అనుమతిస్తామన్నారు. చేతులకు మెహందీ, గోరింటాకు వంటి అలంకరణలు ఉండకూడదన్నారు.