GNTR: చేబ్రోలు మండలం శలపాడులోని శ్రీ రామలింగేశ్వర, చంద్రశేఖర స్వామి ఆలయాల అభివృద్ధికి రూ. 93.33 లక్షలు మంజూరైనట్లు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తెలిపారు. శుక్రవారం ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించిన ఆయన, దేవాలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మంజూరైన నిధులతో ఆలయాలను ఆధునీకరిస్తామని అధికారులతో చర్చించారు.