VZM: మాదక ద్రవ్యాలపై అవగాహన కోసం ఇవాళ ఉదయం 7 గంటలకు బొబ్బిలిలో రాజా కాలేజీ గ్రౌండ్స్ నుంచి భారీ వాక్ థాన్ నిర్వహించనున్నట్లు CI సతీష్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగే 3 KM వాక్‌లో విద్యార్థులు, యువత, వాకర్స్, స్వచ్చంద సంస్థలు, మీడియా మిత్తులు, సాధారణ ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.