SRCL: తెలంగాణ తహశీల్దార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలిగా ఎల్లారెడ్డిపేట తహశీల్దార్ సుజాత నియామితులయ్యారు. శుక్రవారం జరిగిన సమావేశంలో పూర్తి స్థాయి జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా వేముగంటి మురళీకృష్ణ నియమితులయ్యారు.