»Train Passengers Will Book Train Tickets In Watsapp Soon
WHATSAPP : త్వరలో వాట్సాప్‌లో రైలు టికెట్ల రిజర్వేషన్?
రానున్న రోజుల్లో వాట్సాప్‌లోనే ట్రైన్ టికెట్లను బుక్ చేసుకునే సౌకర్యం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు మెటా సంస్థ ఐఆర్సీటీసీతో మంతనాలు జరుపుతోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
WhatsApp has banned the accounts of 76 lakh Indians in a single month
RAILWAY RESERVATION TICKETS IN WHATSAPP : మనం రైలు టికెట్లను రిజర్వ్ చేసుకోవడానికి ఐఆర్సీటీసి వినియోగిస్తూ ఉంటాం. ఆ సైట్‌పై ఎక్కువగా లోడ్ ఉండటం వల్ల టికెట్ బుక్ చేసుకునే సమయంలో అనేక ఇబ్బందులు తలెత్తుతుంటాయి. ఇది ఆ సైట్‌ని వాడేవారు అందరికీ అనుభవమే. అయితే ఇక తేలికగా వాట్సాప్ ద్వారానే మనం రైలు టికెట్లను బుక్ చేసుకునే రోజులు రానున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ మెట్రో సహా, పలు రైలు టికెట్లను వాట్సాప్ ద్వారా బుక్ చేసుకునే సౌలభ్యం ఉంది. ఇప్పుడు సాధారణ రైలు టికెట్ల రిజర్వేషన్(RAILWAY RESERVATION TICKETS) కోసం సైతం మెటా ప్రయత్నాలు మొదలు పెట్టింది.
మెటా సంస్థ ఈ విషయమై ఇప్పటికే ఐఆర్సీటీసీతో(IRCTC) మంతనాలు ప్రారంభించింది. తేలికగా టికెట్లు బుక్ చేసుకునే సదుపాయం కలిగిస్తామని అడుగుతోంది. వాట్సాప్ మరింత యూజర్ ఫ్రెండ్లీగా తయారయ్యేందుకు ఎప్పటికప్పుడు కొత్తగా ముస్తాబు అవుతూనే ఉంటుంది. కొత్త కొత్త ఫీచర్లను తెస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో రైలు టికెట్లను బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు మెటా(META) డైరెక్టర్ రవి గార్గ్ తెలిపారు. ఐఆర్సీటీసీతో చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని అన్నారు.
మొదట రైలు టికెట్ల రిజర్వేషన్‌తో ఈ సేవలను ప్రారంభిస్తామని గార్గ్ అన్నారు. అనంతరం ఆ సేవలను వివిధ రాష్ట్రాల్లోని బస్సు సేవలకూ విస్తరిస్తామని తెలిపారు. ఇటీవల కాలంలో వాట్సాప్ ఏఐ ఆప్షన్ వచ్చిన సంగతి తెలిసిందే. చిన్న చిన్న వ్యాపార సంస్థలకు ఏఐ ఆధారిత ప్రత్యేక సేవలను కూడా తాము అందిస్తున్నట్లు రవి గార్గ్ తెలిపారు. వ్యాపార ప్రకటనలు, ప్రచార రూపకల్పనలో తమ ఏఐ అసెస్టింట్లు ఉచితంగా పని చేస్తున్నట్లు వెల్లడించారు.