»Facebook Instagram Back After Hour Long Outage In India Other Countries
Facebook, Insta : గంటలపాటు పని చేయని ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం
ప్రముఖ సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్లు ఫేస్బుక్, ఇన్స్టా గ్రాం సర్వీసులకు మంగళవారం రాత్రి కొన్ని గంటలుపాటు అంతరాయం కలిగింది... వివరాల్లోకి వెళితే...
Facebook Instagram Down in India : భారత్ సహా కొన్ని దేశాల్లో మంగళవారం రాత్రి ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం, మెసెంజర్, థ్రెడ్స్ సర్వీసుల్లో అంతరాయం ఏర్పడింది. లాగౌట్ అయిన వారు తిరిగి లాగిన్ కావడానికి ఇబ్బంది పడ్డారు. మెటా సంస్థకు చెందిన ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్లు అన్నీ కొద్ది గంటలపాటు మొరాయించాయి. వెంటనే స్పందించిన మెటా యాజమాన్యం ఈ సమస్యను గంటల వ్యవధిలోనే చక్క దిద్దింది.
ఈ విషయంపై మెటా కమ్యూనికేషన్స్ అధిపతి ఆండీ స్టోన్ మాట్లాడారు. సాంకేతిక కారణాల వల్లనే ఫేస్బుక్(
Facebook), ఇన్స్టా గ్రాం(Instagram), థ్రెడ్స్, మెసెంజర్ సర్వీసుల్లో అంతరాయం వచ్చిందన్నారు. సమస్యను గుర్తించి వీలైనంత త్వరగా దాన్ని సవరించినట్లు తెలిపారు. సర్వీసు అంతరాయం వల్ల ఇబ్బందులు పడిన వారందరికీ క్షమాపణలు చెబుతున్నట్లు వెల్లడించారు.
ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్లు సరిగ్గా పని చేయకపోయే సరికి పలువురు వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ ఖాతాలను యాక్సిస్ చేయలేక ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన చెందారు. వీటిని త్వరగా సరి చేయాలని ఇతర సోషల్ మీడియాల్లో పోస్టులు పెట్టారు. తమకే ఇలాంటి ఇబ్బంది వచ్చిందా? లేక అందరికీ ఇలా ఉందా? అని కనుక్కునే ప్రయత్నాలు చేశారు. చివరికి ఈ సేవలు మళ్లీ పునరుద్ధరింపబడటంతో సమస్య తీరింది.