»The Girl Who Made Insta Reels With A Pistol On The Highway The Video Has Gone Viral
Viral News: హైవేపై పిస్తోల్‌తో ఇన్‌స్టా రీల్స్ చేసిన అమ్మాయి.. వీడియో వైరల్
ఇన్‌స్టా రీల్స్ పేరుతో ఇష్టం వచ్చిన వీడియోలు తీయడం ఇప్పుడు ట్రెండ్. అదే తరహాలో ఓ అమ్మాయి చేతులో గన్ పట్టుకొని హైవేపై నిలబడి రీల్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
The girl who made Insta reels with a pistol on the highway.. The video has gone viral
Viral News: పిచ్చి పలు రకాలు అనే నానుడి తెలిసిందే. ఇన్‌స్టా రీల్స్ చేయాలనే పిచ్చితో యువత నానా యావా చేస్తున్నారు. ట్రెండింగ్ కోసం ప్రయాస పడుతున్నారు. పాపులర్ అయ్యేందుకు ఏ వీడియోలైనా చేస్తున్నారు. నెటిజనులను ఆకర్షించేందుకు హద్దులు దాటుతున్నారు. ఇప్పుడు అంతా ఇన్‌స్టా రీల్స్(Instagram Reels) ట్రెండ్ సాగుతొంది. ఈ క్రమంలో ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. లక్నో హైవేపై ఓ అమ్మాయి గన్ పట్టుకొని డ్యాన్స్ చేస్తుంది. అయితే తాను స్థానికంగా పాపులర్ ఇన్ఫ్లుయెన్సర్ అని తెలుస్తుంది.
ఈ లేడీ యూట్యూబర్ సిమ్రన్ యాదవ్ లక్నో హైవేపై ఓ భోజ్‌పురి పాట పెట్టుకొని, చేతులో పిస్తోల్ పట్టుకొని స్టెప్పులేసింది. దీన్ని తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. దీనిపై పలు అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అమ్మాయి డ్యాన్స్ చేసిన వీడియోను ఓ అడ్వకేట్ తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేశాడు. ఇది ప్రజాస్వామ్యానికి ఏ విధంగా మేలు చేస్తుందని ప్రశ్నించారు. ఈ విషయంపై పోలీసులు సైతం సీరియస్‌గా ఉన్నారు. ఆ అమ్మాయిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్దమయ్యారు. దీనిపై సామాజిక మాధ్యామాల్లో భిన్నభిప్రాయాలు వెలువడుతున్నాయి. చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.