Lok Sabha Elections: ఓటు వేయాలంటే గుర్తింపు కార్డుగా దేన్ని చూపించాలి?
ఓటు హక్కును వినియోగించుకోవాలంటే చాలా మంది ఆధార్ కార్డు మాత్రమే గుర్తింపు కార్డుగా చూపించాలి అని నమ్ముతారు. కానీ ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల మేరకు 11 కార్డులలో ఏదైనా చూపించి మీ ఓటును వినియోగించుకోవచ్చు. మరవెంటో చూద్దాం.
Lok Sabha Elections: ఓటు హక్కును వినియోగించుకోవాలంటే చాలా మంది ఆధార్ కార్డు మాత్రమే గుర్తింపు కార్డుగా చూపించాలి అని నమ్ముతారు. కానీ భారత ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఓటరు 11 కార్డులలో ఏదైనా చూపించి మీ ఓటును వినియోగించుకోవచ్చు. అయితే ఓటరు జాబితాలో పేరు ఉండగానే సరిపోదు. ఆ పేరుతో ఉన్న వ్యక్తి తానేనని నిరూపించుకోవాలి అంటే దానికి గుర్తింపు కార్డు తప్పనిసరి. మాములగానేన వయోపరిమితి ఉన్న ప్రతీ ఒక్కరికి ఎన్నికల సంఘం ఓటు హక్కును కల్పిస్తుంది. అందరికీ ఓటరు గుర్తింపు కార్డును అందజేస్తుంది. ఆ కార్డు ప్రకారమే ఓటు వేయాల్సి ఉంటుంది. దానితో పాటు వ్యక్తిగత గుర్తింపు కార్డును కూడా అధికారులకు చూపించాలి.
వ్యక్తి గత గుర్తింపు కార్డులో మీరు పాసుపోర్టు చూపించవచ్చ.
అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కూడా అధికారులకు చూపించి మీ ఓటును కాస్ట్ చేసుకోవచ్చు.
దాని తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పీఎస్‌యూలు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు ఉద్యోగులకు జారీ చేసిన ఫొటోతో కూడిన సర్వీసు గుర్తింపు కార్డులు వినియోగించవచ్చు.
బ్యాంకులు జారీ చేసిన పాస్ పుస్తకం, తపాలా కార్యాలయాలు జారీ చేసిన ఫొటో ఉన్న పాస్ పుస్తకాలు చూపించి ఓటు వేయవచ్చు.
పాన్‌కార్డు, ఎన్పీఆర్ కింద ఆర్జీఐ జారీ చేసిన స్మార్ట్ కార్డు, అంతే కాకుండా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు సైతం చూపించి ఓటు వేయవచ్చు.
కార్మిక మంత్రిత్వశాఖ పథకం కింద జారీ చేసిన ఆరోగ్యబీమా స్మార్ట్ కార్డు కూడా చూపించవచ్చని ఎన్నికల సంఘం ఆదేశాలు ఉన్నాయి.
ఫొటోతో కూడిన పింఛను పత్రం సైతం ఓటు వినియోగించుకోవడానికి ఉపయోగించవచ్చు.
అలాగే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు కూడా చెల్లుబాటు అవుతాయి.
ఇక చివరిగా ఆధార్‌కార్డు చూపించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.