AP: టెక్నాలజీతో భాషను కాపాడుకోవచ్చని సీఎం చంద్రబాబు అన్నారు. కొత్త యాప్లు వచ్చాయని, తెలుగులో మాట్లాడితే తెలుగులోనే సమాధానమిస్తాయన్నారు. టైప్ చేయడానికి తెలియనివాళ్లు కూడా టెక్నాలజీ ఉపయోగించుకునే పరిస్థితి వచ్చిందన్నారు. పొట్టిశ్రీరాములు పేరుతో 1985లోనే ఎన్టీఆర్.. తెలుగు వర్సిటీ తీసుకొచ్చారని తెలిపారు. రాజమండ్రిలో పొట్టిశ్రీరాములు తెలుగు వర్సిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు.