»Do You Know Where To Put An Ink Mark If You Dont Have A Finger
Lok Sabha Elections: వేలు లేకపోతే సిరా గుర్తు ఎక్కడ వేస్తారో తెలుసా?
ఓటింగ్ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది సిరా గుర్తు. ఓటును వినియోగించుకున్నామనే గుర్తు కూడా సిరా గుర్తే. మరీ వేలు లేకపోతే సిరా గుర్తు ఎక్కడ వేస్తారు అనేది చాలా మందికి ఉన్న ప్రశ్న.. మరి సమాధానం ఏంటో చూద్దాం.
Lok Sabha Elections: దేశమంతా లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ రోజు మూడవ దశ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఎన్నికలు అనగానే అందరికి గుర్తుకొచ్చేది సిరా గుర్తు. పోలింగ్ రోజు ఓటేసినట్లు గుర్తుపట్టేందుకు ఆ సిరా గుర్తును చేతి వేలుకు పూస్తారు. అంతే కాకుండా మళ్లీ ఓటు వేయకుండా ఉండేందుకు, దొంగ ఓట్లు నమోదు కాకుండా ఆ సిరా గుర్తు ఉపయోగపడుతుంది. ఒక్కసారి వేలుకు రాస్తే అది పోవడానికి కనీసం వారం రోజులైన పడుతుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఆ సిరా గుర్తును ఎడమ చేయి చూపుడు వేలుకు మాత్రమే వేస్తారు.
అయితే ఒక వేళ ప్రమాదవశాత్తు ఎడమ చేయి చూపుడు వేలు లేకపోతే ఎలా అనే అనుమానం కొందిరిలో ఉంటుంది. ఒక వేళ అదే జరిగితే ఎడమ చేయి మధ్య వేలుకు వేయాలని ఎన్నికల సంఘం చెబుతోంది. అదీకూడా లేకపోతే బొటనవేలుకు అలా ముందు ఎడమ చేతిలోనే ఏదైనా ఒక వేలికి వేయమంటుంది. అసలు చేయి లేని పరిస్థితుల్లో కుడి చేయి చూపుడు వేలుకు ప్రధాన్యం ఇస్తారు. అది లేకపోతే మధ్య వేలు, అదీ లేకపోతే ఉంగరం వేలుకు వేయమంటుంది. దురద్రుష్టవశాత్తు రెండు చేతులు లేకపోతే ఎడమ కాలుకు. ఇదీ కూడా చేతి వేళ్ల వరసనే సీరా రాస్తారు.
#WATCH | Nadiad, Gujarat: Ankit Soni, a voter, casts his vote through his feet at a polling booth in Nadiad
He says, "I lost both my hands due to electric shock 20 years ago. With the blessings of my teachers and guru, I did my graduation, CS… I appeal to people to come out… pic.twitter.com/UPx8G5MTPz