VKB: బొంరాస్పేట మండలం దరికిందితండా ప్రాథమిక పాఠశాలను మండల విద్యాధికారి హరిలాల్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు విద్యార్థుల సామర్ధ్యాలను పరిశీలించారు. అనంతరం మదన్ పల్లి పాఠశాలలో కొనసాగుతున్న ప్రహరీ గోడ నిర్మాణ పనులను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలన్నారు.