AP: గతేడాది గోదావరి, కృష్ణా వేల టీఎంసీలు సముద్రంలోకి వెళ్లాయని, తెలంగాణ గోదావరి నీళ్లు వాడుకుంటే తాను అడ్డు చెప్పలేదని సీఎం చంద్రబాబు అన్నారు. విభజన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు గోదావరిపై ఎన్ని కట్టినా ఫర్వాలేదనుకున్నా.. కాళేశ్వరం కట్టినా అభ్యంతరం చెప్పలేదన్నారు. గోదావరిలో చాలా నీళ్లున్నాయని అభ్యంతరం చెప్పలేదని తెలిపారు. ఏపీలో నదులన్నీ అనుసంధానం కావాలన్నారు.