AKP: ఉపాధి హామీకి సంబంధించి పాత పథకాన్నే కొనసాగించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గనిశెట్టి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం మునగపాక మండలం వెంకటాపురం పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. వేతనదారులకు 200 రోజులు పని దినాలు కల్పించాలన్నారు. రోజువారి వేతనం రూ. 600కు పెంచాలన్నారు. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిధులు కేటాయించాలన్నారు.