కృష్ణా: గుడ్లవల్లేరు మండల మహిళా సమైక్య కార్యాలయంలో మూడు రోజులపాటు మండల సమాఖ్యల ద్వారా వ్యాపార అభివృద్ధి ప్రణాళికలపై మంగళవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మండల సమాఖ్యాల ద్వారా స్వయంగా వ్యాపారాలు నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సత్యభామ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని సమాఖ్యల సిబ్బంది, ఏపీఎంలు, సీసీలు పాల్గొన్నారు.