SKLM: ఆమదాలవలసలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయంలో జరుగుతున్న శ్రీ నవగ్రహ సహిత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యగా మహోత్సవంలో మాజీ స్పీకర్, జిల్లా పార్లమెంటరీ సమన్వయకర్త తమ్మినేని సీతారాం ఇవాళ పాల్గొన్నారు. ఈ మేరకు స్వామికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు అరవల్లి భాస్కర శర్మ వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.