»These Are The Mp Candidates Who Cant Vote For Them
Lok Sabha Elections: వాళ్ల ఓటు వారికి వేసుకోలేని ఎంపీ అభ్యర్థులు వీరే?
తమ ఓటు తాము వేసుకోలేని ఎమ్మెల అభ్యర్థులను చూశాము ఇప్పుడు పార్లమెంట్ స్థానంలో పోటీచేసే అభ్యర్థులు సైతం తమ ఓటును తమకోసం వినియోగించుకోలేరు. మరీ వారేవరో చూద్దాం.
These are the MP candidates who can't vote for them?
Lok Sabha Elections: భారత ప్రజాస్వామ్యంలో ఒక భారతీయుడు ఏ చోటు నుంచైనా పోటీ చేయొచ్చనేది అందరికీ తెలిసిన విషయమే. ఇది కాసేపు పక్కన పెడితే మన తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో ముఖ్యంగా త్రిముఖ పోటీ కొనసాగుతుంది. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులు వేగంగా ప్రచారం చేస్తున్నారు. ఈ మేరకు ఒక విషయం షోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతుంది. గతంలో కూడా ఎమ్మెల్యే అభ్యర్థులు నాన్ లోకల్ నియోజకవర్గాల్లో పోటీ చేయడం వలన వారికోసం వారు ఓటు వేసుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు కూడా ఎంపీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు కొందరు తమ కోసం తాము ఓటు వేసుకోలేకపోతున్నారు. వారేవరో చూద్దాం.
హైదరాబాద్ ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్న ఎంఐఎం పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ అభ్యర్థులు ముగ్గురూ కూడా తమకోసం తాము ఓటు వేసుకునే అవకాశం లేదు. అసదుద్దిన్ ఒవైసీ నివాసం రాజేంద్రనగర్లో ఉంది. అది చేవెళ్ల లోక్ సభ పరిధిలోకి వస్తుంది. అయితే అక్కడ ఎంఐఎం అభ్యర్థి పోటీలో లేకపోవడంతో ఆయన వేరే పార్టీకి ఓటు వేయాల్సి ఉంటుంది. అలాగే అదే స్థానంలో పోటీ చేస్తున్న బీజేపీ కాండిడేట్ మాధవీలత నివాసం ఈస్ట్ మారెడుపల్లిలో ఉంది. అది కంటోన్మెంట్ పరిధిలోకి వస్తుంది. అలాగే కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న మహ్మాద్ సమీర్ నివాసం జూబ్లీహీల్స్లో ఉంది. అది సికింద్రబాద్ పరిధిలోకి వస్తుంది. ఆయన సైతం తన ఓటును తనకోసం వేసుకోలేడు. అలాగే మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునితా మహేందర్ రెడ్డికి తాండూరు, చేవెళ్ల నియోజకవర్గంలో ఓటు ఉంది. అలాగే చేవెళ్ల ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కుతుబుల్లాపూర్ నియోజకవర్గంలో ఓటు ఉంది. అది మల్లాజిగిరి పార్లమెంట్ స్థానంలో వస్తుంది. వీరు కూడా తమగెలుపుకోసం ఓటు వేసుకోలేరు.