A case has been registered against Addanki Dayakar comments against Sriram
Addanki Dayakar: కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్‌పై కేసు నమోదయింది. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో అద్దంకి నోరు జారిడనే ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలోని బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో నిర్మల్ పోలీసులు అద్దంకిపై ఐపీసీ సెక్షన్ 504, 505/2 కింద కేసు పెట్టినట్లు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్‌లో ఈ నెల 5న కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభలో అద్దంకి దయాకర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. బీజేపీ నేతలను విమర్శించారు. అందులో భాగంగా శ్రీరాముడిపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు మేం హిందువులం.. శ్రీరాముడి వారసులం అంటున్నారు. మీకు రాముడు చిన్నాయనా, సీత మీ చిన్నమ్మనా అని విమర్శించారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు వివాదాస్పదం అయ్యాయి.
అద్దంకి దయాకర్(Addanki Dayakar) చేసిన ఈ వ్యాఖ్యలను బీజేపీ నేతలు, హిందూ సంఘాలు ఖండించాయి. ఆయన మాటలపై క్షమాపణ చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. ఈ వివాదం పెద్దది కావడంతో అద్దంకి దయాకర్ తన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆయన చేసిన వ్యాఖ్యలను కొంత మంది వక్రీకరించారని, ఉద్దేశపూర్వకంగా వివాదాస్పదం చేశారని వివరణ ఇచ్చారు.
బీజేపీ అబద్దాల ప్రచారాలను నమ్మకండి.
▪️రాముణ్ణి మొక్కుడే బీజేపీని తొక్కుడే.
▪️నిర్మల్ లో నేను మాట్లాడిన మాటలు వక్రీకరించారు.
▪️అమిత్ షా, మోడీలను రాజకీయంగా విమర్శిస్తే దాన్ని రాముడి మీదికి తెచ్చి పబ్బం గడుపుతున్నారు.