MLC Kavitha: Extension of Kavitha's judicial custody
MLC Kavitha: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టు అయిన ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తిహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈరోజుతో కస్డటీ ముగియడంతో ఆమెను మళ్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆమెకు ఈ నెల 14 వరకు కస్టడీ పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఈడీ కస్టడీ పొడిగించాలని కోరడంతో న్యాయమూర్తి ఏకీభవించారు. మళ్లీ మే 14న కవితను కోర్టులో హాజరు పర్చాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఈక్రమంలో కవిత మాట్లాడుతూ.. ప్రజ్వల్ రేవణ్న వంటి వాళ్లను దేశం దాటించి తనలాంటి వారిని అరెస్టు చేయడం దారుణమన్నారు.
ఇది కూడా చూడండి: Lack of blood: శరీరంలో రక్తం తక్కువగా ఉంటే ఏమౌతుంది..?

