Former Minister Harish Rao Mulakat with MLC Kavita in Tihar Jail
Harish Rao: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను శుక్రవారం మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు కలిశారు. ఈ లిక్కర్ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితపై ఈడీ, సీబీఐ కేసులు వేసింది. కవిత అరెస్టు అయి దాదాపు నాలుగు నెలలు కావొస్తుంది. ఈ కేసులో ఇప్పటివరకు కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వలేదు. ఇటీవలే బీఆర్ఎస్ మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, కేటీఆర్ కవితను కలిసిన విషయం తెలిసిందే. ఇవాళ తాజాగా మాజీ మంత్రి హరీశ్ రావు శుక్రవారం ఉదయం కలిశారు.
ఈ ములాఖాత్ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కేసులో రిమాండ్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. జులై 5వ వరకు ఆమె కస్టడీని పొడిగిస్తూ ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ సందర్భంగా జైలులో కవిత కోరిక మేరకు చదువుకోవడానికి బుక్స్ ఇచ్చారు.