TG: రాష్ట్రంలో ధాన్యం సేకరణ అధ్వానంగా సాగుతోందని, దీనికి పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్రంపై విమర్శలు చేయడం మానాలని, వరి కొనుగోళ్లు రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని గుర్తుంచుకోవాలన్నారు. దళారీలు, అధికారుల చేతుల్లో రైతులు నలిగిపోతున్నారని, బీజేపీ బస్సు యాత్ర వల్లే ప్రభుత్వంలో కదలిక వచ్చిందన్నారు.