KMR: నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టు నుంచి ప్రతిరోజు 11 క్యూసెక్కుల నీరు ఆవిరిగా మారి వృథాగా పోతుందని అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది 30.543 టీఎంసీల నీరు ఇన్ఫ్లో వచ్చి చేరగా ప్రస్తుతం ఎటువంటి ఇన్ఫ్లో, ఔట్ ఫ్లో లేదని తెలిపారు. యాసంగికి 1.364 టీఎంసీల పలు దశల్లో విడుదల చేయగా 1.820 టీఎంసీలకు గాను ప్రస్తుతం 0.138 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు.