NZB: ఎడపల్లి మండలం దుబ్బతండాలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ యువతి శనివారం యువకుడి ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. అదే గ్రామానికి చెందిన యువకుడు ప్రేమిస్తున్నానని చెప్పి తనను నమ్మించాడని బాధితురాలు ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ ఆందోళన చేపట్టింది. ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.