MBNR: జడ్చర్ల మున్సిపాలిటీ పాతబజార్ హరిజనవాడ మహిళా సంఘాల సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. జడ్చర్ల శాసనసభ్యులు శ్రీ జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పెద్ద సంఖ్యలో మహిళా సంఘాల సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వంశీచారి, సుంకసారి రమేష్, గుండు వెంకటేష్, బుచ్చిలింగం, రఘు పాల్గొన్నారు.