మెదక్ పట్టణంలో గ్రోస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా నిత్యవసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చేయూతనందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గంట సంపత్, జాయ్ ముర్రే పాల్గొన్నారు.