MDK: చేగుంట మండలం పోలంపల్లి యువకులు PPL-2 క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయగా సర్పంచ్ కొండి రాజ్యలక్ష్మి స్వామి ప్రారంభించారు. యువత క్రీడల్లో ముందుకు వచ్చి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఎదిగి మంచి భవిష్యత్తుకు మార్గదర్శకంగా ఉండాలన్నారు. క్రీడల్లో రాణించేందుకు యువత ముందుకు రావాలని సర్పంచ్ పిలుపునిచ్చారు.