ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలో పారిశుధ్య సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా శనివారం మున్సిపాలిటీ పారిశుధ్య విభాగానికి చెందిన అన్ని వాహనాలకు ఫ్యూయల్ సెన్సార్లను ఏర్పాటు చేశారు. ఇంధన వినియోగంపై కచ్చితమైన పర్యవేక్షణ కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు.