MDK: కాట్రియాల గ్రామంలోని పెద్ద చెరువులో నల్లమట్టి తవ్వకాలను సర్పంచ్ కొత్త స్రవంతి రాజేందర్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చెరువు నల్లమట్టిని పొలాలకు చల్లడం వల్ల భూమి సారవంతత పెరిగి పంట దిగుబడులు మెరుగుపడతాయని తెలిపారు. రైతులు అందరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.