బెజ్జంకిలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి, నాయకుడు లింగాల లక్ష్మణ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రైతుల ధాన్యం కొనుగోళ్లు, రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులపై విమర్శలు చేయడం తగదన్నారు.