ASF: గడిచిన 24 గంటల్లో దహెగాంలో అత్యధికంగా 46.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాగజ్ నగర్ 46.0, బెజ్జూర్, పెంచికల్ పేట్ , రెబ్బెన, సిర్పూర్ 45.9 డిగ్రీలు రికార్డయ్యాయి. తిర్యాణిలో 45.5, కౌటాల 45.1, ఆసిఫాబాద్ 44.9, కెరమెరి 44.6, వాంకిడిలో 44.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే వడగాల్పులు వీస్తుండటంతో జనం బయటకు రావడానికి బెంబేలెత్తుతున్నారు.