BDK: విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు రైతులు తప్పనిసరిగా రశీదు భద్రపరుచుకోవాలని ఏవో జి. నర్మద తెలిపారు. సుజాతనగర్ మండలలో వానాకాలం పంటల సాగు కోసం రైతులు లైసెన్స్ కలిగిన డీలర్ల వద్దే విత్తనాలు కొనుగోలు చేయాలని ఆమె నేడు సూచించారు. గ్రామాల్లో తిరిగి ఎవరైనా లైసెన్స్ లేకుండా విత్తనాలు విక్రయిస్తే వెంటనే వ్యవసాయశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు.