GDWL: జిల్లా టీపీసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా యూత్ కాంగ్రెస్ నాయకుడు రాజేంద్ర నియమితులయ్యారు. HYDలో మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి డా. ఎస్.ఏ. సంపత్ కుమార్ ఆధ్వర్యంలో ఆయన మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ నూతన అధ్యక్షుడు రాజేంద్రకు నియామక పత్రాన్ని అందజేసి అభినందించారు.