NGKL: అకాల వర్షాలకు పెద్దకొత్తపల్లి మండలంలో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. నేలరాలిన కాయలను అమ్ముకునేందుకు మార్కెట్ లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటు వ్యాపారులు కొనకపోవడంతో పంట పొలాల్లోనే మామిడికాయలు కుళ్ళిపోతున్నాయని, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.