KMR: భిక్కనూర్ మండలం అంతంపల్లి సొసైటీలో నేటి నుంచి జీలుగు విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు ఏఈవో లిఖిత్ రెడ్డి తెలిపారు. 50 శాతం రాయితీతో పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని అంతంపల్లి, లక్ష్మిదేవునిపల్లి గ్రామాల రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులు తమ వెంట ఆధార్ కార్డ్, పట్టా పాస్‌బుక్ జిరాక్స్‌లతో పాటు మొబైల్ ఫోన్ వెంట తీసుకురావాలన్నారు.